Malikipuram: రూ.1.24 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శ్రీకారం!

Malikipuram: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, టీడీపీ నేత గొల్లపల్లి అమూల్యతో కలిసి మలికిపురంలో రూ.1.24 కోట్ల విలువైన సీసీ రోడ్లు, హెల్త్ క్లినిక్‌లను ప్రారంభించారు.

PRABHU, RAZOLE
Published on: 9 July 2026 4:14 PM IST
Malikipuram
X

Malikipuram: రూ.1.24 కోట్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శ్రీకారం!

Malikipuram: రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు ఇన్‌చార్జి గొల్లపల్లి అమూల్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రూ.1.08 కోట్ల వ్యయంతో గాంధీ బొమ్మల సెంటర్ నుంచి విశ్వేశ్వరాయపురం ప్లీడర్ గారి మలుపు వరకు నిర్మించిన ఆర్ & బి రహదారిని, రూ.16 లక్షలతో అచ్యుత రామరాజు గారి ఇంటి నుంచి గుబ్బలవారి గ్రూపు వరకు నిర్మించిన సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించారు. అలాగే గుబ్బలవారి గ్రూపు శివారు, ఎంఈఓ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన మలికిపురం–2 విలేజ్ హెల్త్ క్లినిక్‌ను ప్రజలకు అంకితం చేశారు.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మెరుగైన రహదారులు, పారిశుద్ధ్య సౌకర్యాలు, నాణ్యమైన వైద్య సేవలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

మలికిపురం అభివృద్ధిలో భాగంగా గ్రామంలోని సుమారు 3.5 కిలోమీటర్ల ప్రధాన రహదారి విస్తరణ, రైతు బజార్ నిర్మాణం, గ్రామ పారిశుద్ధ్య నిర్వహణ కోసం డంపింగ్ యార్డ్ ఏర్పాటు వంటి పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు.

మలికిపురం–2 విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణానికి స్థలాన్ని విరాళంగా అందించిన గంగరాజును ఎమ్మెల్యే సాలువాతో సన్మానించి అభినందించారు. అలాగే ముస్లిం వక్ఫ్ బోర్డు ద్వారా పీర్ల పండుగ నిర్వహణకు మంజూరైన ఆర్థిక సహాయాన్ని సంబంధిత ప్రతినిధులకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story