Malikipuram: పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపుపై ఎమ్మెల్యే దేవ తీవ్ర ఆగ్రహం!

Malikipuram: ప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఫోటోలను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించిన ఘటనపై రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ తీవ్రంగా స్పందించారు.

PRABHU, RAZOLE
Published on: 15 July 2026 11:03 PM IST
Malikipuram
X

Malikipuram: పవన్ కళ్యాణ్ ఫోటోల తొలగింపుపై ఎమ్మెల్యే దేవ తీవ్ర ఆగ్రహం!

మలికిపురం: అభివృద్ధి శిలాఫలకాలపై ఉన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలను తొలగించిన ఘటనను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సీరియస్‌గా తీసుకున్నారు. సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న శిలాఫలకం పైన, మోరిపోడు గ్రామం లోని రంపాలమ్మ తల్లి గుడి సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకం పై ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించగా, జనసేన నేతల ఫిర్యాదు మేరకు సఖినేటిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురం లోని తన పార్టీ క్యాంపు కార్యాలయంలో పోలీసు అధికారులు, కూటమి ముఖ్య నేతలతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. మరో ఐదు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఈ ఘటనలకు బాద్యులైన వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని కోరారు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి చర్యలనైనా సహించబోమని స్పష్టం చేశారు. పోలీసులకు ప్రజలు పూర్తిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story