Razole: మట్టి తరలింపు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Razole: తాటిపాకలోని ఈదరాడ కాలువ వద్ద కొనసాగుతున్న మట్టి తరలింపు పనులను రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Razole: మట్టి తరలింపు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్
Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో కొనసాగుతున్న మట్టి తరలింపు పనులతో పాటు, తాటిపాక లోని ఈదరాడ కాలువ వద్ద జరుగుతున్న మట్టి తరలింపు కార్యక్రమాలను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో మాట్లాడి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు, విద్యార్థులు, రైతులకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలను నాణ్యతతో, సమయపాలనతో అమలు చేయాలని సూచించారు.
ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.




