P. Gannavaram: పి. గన్నవరం ఘనంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ 40వ వార్షికోత్సవం

P. Gannavaram: పి. గన్నవరం కే. ఏనుగుపల్లిలో హౌస్ ఆఫ్ ప్రేయర్ 40వ వార్షికోత్సవం. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ.

RAJU, P GANNAVARAM
Published on: 11 July 2026 3:19 PM IST
P. Gannavaram
X

P. Gannavaram: పి. గన్నవరం ఘనంగా హౌస్ ఆఫ్ ప్రేయర్ 40వ వార్షికోత్సవం

పి. గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, కే. ఏనుగుపల్లి గ్రామంలో నిర్వహించిన హౌస్ ఆఫ్ ప్రేయర్ 40వ వార్షికోత్సవ వేడుకల్లో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులుగిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చర్చి నిర్వాహకులు, విశ్వాసులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఎమ్మెల్యే, హౌస్ ఆఫ్ ప్రేయర్ గత 40 సంవత్సరాలుగా సమాజంలో ఆధ్యాత్మిక విలువలు, ప్రేమ, సేవాభావాన్ని పెంపొందించడంలో విశిష్ట సేవలందిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అనంతరం 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కేక్‌ను కట్ చేసి, చర్చి సభ్యులు, విశ్వాసులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చర్చి పెద్దలు, పాస్టర్లు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు మరియు క్రైస్తవ సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story