Ambajipeta: ఇసుకపూడి, చిరుతపూడిలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రచారం

Ambajipeta: అంబాజీపేట మండలం ఇసుకపూడి, చిరుతపూడి గ్రామాల్లో పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూటమి అభ్యర్థుల తరఫున ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

RAJU, P GANNAVARAM
Published on: 2 Nov 2026 3:47 PM IST
Ambajipeta
X

Ambajipeta: ఇసుకపూడి, చిరుతపూడిలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రచారం

Ambajipeta: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి, చిరుతపూడి గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ కూటమి బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని తెలిపారు.

కూటమి తరఫున జడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దొమ్మేటి సాయికృష్ణతో పాటు కూటమి బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల నిరంతర కొనసాగింపునకు స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థుల విజయమే కీలకమని, ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకు అండగా నిలవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM