P Gannavaram: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో రైతులకు విముక్తి ఎమ్మెల్యే

P Gannavaram: అంబాజీపేట మండలం ఇరుసుమండలో రాజముద్రతో కూడిన కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ రైతులకు పంపిణీ చేశారు.

RAJU, P GANNAVARAM
Published on: 7 July 2026 5:35 PM IST
P Gannavaram
X

P Gannavaram: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో రైతులకు విముక్తి ఎమ్మెల్యే

P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అంబాజీపేట మండలం, ఇరుసుమండ గ్రామంలో నిర్వహించిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం రైతుల పట్ల అనుసరించిన విధానాలను విమర్శిస్తూ, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రైతులపై భారాన్ని మోపిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేసి, "రైతే రాజు" అనే సంకల్పంతో రైతు సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం కల్పించిందని పేర్కొన్నారు.

రైతుల కృషి వల్లే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని పేర్కొన్న ఆయన, ప్రస్తుతం అందజేస్తున్న పట్టాదార్ పాస్ పుస్తకాలు ప్రత్యేకతను కలిగి ఉన్నాయని తెలిపారు. రైతుకు సంబంధించిన అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, రైతు ఆమోదంతోనే పట్టాదార్ పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని వివరించారు.

గతంలో పట్టాదార్ పాస్ పుస్తకాలపై నాయకుల ఫోటోలకు ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించిన ఆయన, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా, కేవలం రాజముద్రతోనే పాస్ పుస్తకాలను జారీ చేస్తోందని తెలిపారు.

కార్యక్రమం అనంతరం స్థానిక ఎమ్మార్వో అందించిన నోట్ పుస్తకాలను ఎమ్మెల్యే విద్యార్థుల చేతులకు అందజేశారు.

రైతుల పట్ల కూటమి ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధత, పారదర్శకత, బాధ్యతాయుత పాలనకు ఈ కార్యక్రమం నిదర్శనమని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story