P Gannavaram: పి.గన్నవరంలో రూ.34 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
P Gannavaram:పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ 62 మంది లబ్ధిదారులకు రూ 34 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
P Gannavaram: పి.గన్నవరంలో రూ.34 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ!
పి.గన్నవరం: పి.గన్నవరం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇది 32వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమమని తెలిపారు. ఈరోజు మొత్తం 62 మంది లబ్ధిదారులకు రూ.34,14,835/- విలువైన చెక్కులను అందజేసినట్లు పేర్కొన్నారు.
పేద ప్రజలు అనారోగ్య సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రిలీఫ్ ఫండ్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు.
అలాగే, “పవనన్న ఆరోగ్య భరోసా” కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో పేద ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం, అవసరమైన మందులు అందించడం, ఉచిత శస్త్రచికిత్సలు చేయించడం, కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్లజోళ్లు అందించడం జరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు, రాష్ట్ర డైరెక్టర్లు, నీటి సంఘ చైర్మన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.




