Mamidikuduru: మొహర్రం పంజాల నిర్వహణకు వక్ఫ్ బోర్డు ఆర్థిక సాయం!
Mamidikuduru: మామిడికుదురులో మొహర్రం పంజాల నిర్వహణ కోసం రాష్ట్ర వక్ఫ్ బోర్డు అందించిన ఆర్థిక సహాయాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అందజేశారు.
Mamidikuduru: మొహర్రం పంజాల నిర్వహణకు వక్ఫ్ బోర్డు ఆర్థిక సాయం!
మామిడికుదురు: మొహర్రం సంతాప కార్యక్రమాల్లో భాగంగా పంజాల నిర్వహణ కోసం రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సహాయాన్ని పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ చేతుల మీదుగా సంబంధిత నిర్వాహకులకు అందించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ హాజీ ముఖరం హుస్సేన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ప్రతి ఏడాది మొహర్రం సందర్భంగా పంజాల నిర్వహణకు ఆర్థిక సహాయం అందజేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఆబేద్ అలీ, కిషోర్ అబ్బాస్, సర్కిల్ ఫకర్ సాహెబ్, అబ్బాస్ రజా మాజీద్రాణి, అబ్బాస్ అలీ, అక్బర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Next Story




