Ainavilli: అయినవిల్లి సిరిపల్లిలో చర్చ్ మందిర ప్రతిష్ఠ
Ainavilli: సిరిపల్లిలో యేసుపాదం ఫౌండేషన్ చర్చ్‌ను ప్రారంభించిన పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్ష.
Ainavilli: అయినవిల్లి సిరిపల్లిలో చర్చ్ మందిర ప్రతిష్ఠ
అయినవిల్లి: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, సిరిపల్లి గ్రామంలో నిర్వహించిన యేసుపాదం ఫౌండేషన్ చర్చ్ మందిర ప్రతిష్ఠ కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన ప్రార్థనా మందిరం ప్రజలకు ఆధ్యాత్మిక సేవలకు కేంద్రంగా నిలవాలని ఆకాంక్షిస్తూ, క్రైస్తవ సోదర సోదరీమణులకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వం మరింత పెంపొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, చర్చ్ నిర్వాహకులు, క్రైస్తవ పెద్దలు, విశ్వాసులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Next Story




