Krishnunipalem: కృష్ణునిపాలెంలో 949 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Krishnunipalem: జగ్గంపేట మండలం కృష్ణునిపాలెంలో 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా 949 పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు.

NARAYANA, RAJANAGARAM
Published on: 5 Sept 2026 8:08 PM IST
Krishnunipalem
X

Krishnunipalem: కృష్ణునిపాలెంలో 949 పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

Krishnunipalem: గత వైసిపి ప్రభుత్వం మీ భూమి హక్కులను హరించిందని, కూటమి ప్రభుత్వం ద్వారా మీ బొమ్మలకు రక్షణ కల్పించామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. శనివారం నాడు కృష్ణునిపాలెం సచివాలయం వద్ద రైతులకు పట్టాదారు పాస్ పుస్తకలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సొంత భూమిపై జగన్ రాళ్లు వేసాడని, మీ పాస్బుక్కులపై జగన్ ఫోటో ముద్రించి రెవెన్యూ వ్యవస్థను అపహాస్యం చేశాడని ఎమ్మెల్యే జ్యోతులు అన్నారు. కృష్ణునిపాలెం గ్రామంలో 949 పాస్ పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. కూటమిపారంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో పారదర్శకంగా పాలన అందిస్తున్నారని నెహ్రూ అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి కన్నబాబు, జగ్గంపేట మార్కెట్ అభివృద్ధి కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, గ్రంథాలయ మాజీ చైర్మన్ ఎస్వీఎస్ అప్పలరాజు, మార్కెట్ అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ జనపరెడ్డి సుబ్బారావు (బాబు), గోకవరం సొసైటీ మాజీ చైర్మన్ దాసరి తమ్మన్న దొర, మండల కన్వీనర్ పిల్లా చంటిబాబు, మారిశెట్టి భద్రం, తంటికొండ దేవస్థానం చైర్మన్ బద్దిరెడ్డి అచ్చన్న దొర,క్లస్టర్ ఇంచార్జ్ బద్దిరెడ్డి బాబి, పురంశెట్టి శివాజీ, మండల ప్రధాన కార్యదర్శి గునుపే భరత్, నల్లమిల్లి కోటిరెడ్డి,మండల ఆర్గనైజింగ్ సెక్రెటరీ మండిగ గంగాధర్, రాజు చెరువు చైర్మన్ మండిగ బాలాజీ, మలిరెడ్డి శ్రీకృష్ణ, బోలకొండ రాజారెడ్డి, అమర దొర,మండల టిడిపి మీడియా కోఆర్డినేటర్, గ్రామ పార్టీ అధ్యక్షులు కొంగరపు రాజు, గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు అల్లాడ అరుణ, గుండా శివ ప్రసాద్, జగ్గంపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్ దిబ్బ నాగమణి శ్రీను, ఈదల బాబి,తుర్రం చెల్లన్నదొర తదితరులు పాల్గొన్నారు.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM

Next Story