Gopalapuram: గోపాలపురం, దేవరపల్లి పోలీసులకు బొలెరో నియో వాహనాలు!

Gopalapuram: పీ4 విధానంలో గోపాలపురం, దేవరపల్లి పోలీస్ స్టేషన్లకు రూ.24 లక్షల విలువైన రెండు మహీంద్రా బొలెరో నియో వాహనాలను జిల్లా ఎస్పీ సమక్షంలో ఎమ్మెల్యే మద్దిపాటి అందజేశారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 2 Sept 2026 5:26 PM IST
Gopalapuram
X

Gopalapuram: గోపాలపురం, దేవరపల్లి పోలీసులకు బొలెరో నియో వాహనాలు!

గోపాలపురం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న P4 విధానంలో భాగంగా గోపాలపురం నియోజకవర్గ పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం పోలీస్ స్టేషన్లకు రూ.24 లక్షల విలువైన రెండు మహీంద్రా బొలెరో నియో వాహనాలను అందజేశారు. పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ వాహనాలను సమకూర్చారు.

రాజమహేంద్రవరం జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్, ఐపీఎస్ గారి సమక్షంలో గోపాలపురం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారు వాహనాల అందజేత కార్యక్రమంలో పాల్గొన్నారు.

గోపాలపురం పోలీస్ స్టేషన్‌కు ఒక మహీంద్రా బొలెరో నియో వాహనాన్ని ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారు, గోపాలపురం మండల నాయకులు, వారి సహచరుల సౌజన్యంతో అందజేశారు. అదేవిధంగా దేవరపల్లి పోలీస్ స్టేషన్‌కు మరో బొలెరో నియో వాహనాన్ని పరమేశు బయోటెక్ సంస్థ తమ సంస్థ సౌజన్యంతో అందించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఆనంద స్వరూప్ గారు ఎమ్మెల్యే శ్రీ మద్దిపాటి వెంకట రాజు గారితో కలిసి వాహనాన్ని పోలీస్ శాఖకు అందజేశారు.

ఒక్కో వాహనం విలువ రూ.12 లక్షలు కాగా, రెండు వాహనాల మొత్తం విలువ రూ.24 లక్షలుగా ఉంది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నూతన వాహనాలు పోలీసు అధికారులు, సిబ్బంది అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు, శాంతిభద్రతలను సమర్థవంతంగా పరిరక్షించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలకు త్వరితగతిన పోలీస్ సేవలు అందించడంలో ఇవి కీలకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ప్రజాప్రతినిధులు, సంస్థలు, దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఎస్పీ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ, కొవ్వూరు డీఎస్పీ, ఎస్‌బీ డీఎస్పీ, ఏఆర్ డీఎస్పీ, దేవరపల్లి సర్కిల్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story