Rampachodavaram: వన దుర్గాదేవి ఆలయంలో రంపచోడవరం ఎమ్మెల్యే పూజలు!
Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరం ఎమ్మెల్యే, ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్పర్సన్ మిరియాల శిరీషాదేవి వైకుంఠపురం వన దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Rampachodavaram: వన దుర్గాదేవి ఆలయంలో రంపచోడవరం ఎమ్మెల్యే పూజలు!
రంపచోడవరం: ఏజెన్సీ ముఖద్వారం వైకుంఠపురం వన దుర్గాదేవి ఆలయంలో రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి, తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ లు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏలేశ్వరం మండలం వైకుంఠ పురంలో రాజవొమ్మంగి జనసేన మండల పార్టీ అధ్యక్షులు బొదిరెడ్డి త్రిమూర్తులు కుటుంబ సమేతంగా ఆదివారం ప్రత్యేక మొక్కుబడి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆమె భర్త నియోజక వర్గ తెలుగు యువత అధ్యక్షులు మఠం విజయ్ భాస్కర్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వన దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వన దుర్గాదేవి కోరిన కోరికలు తీర్చే మహిమ గల ఆలయమన్నారు. ఇక్కడకు మైదానప్రాంతం నుండి ఏజెన్సీ నుండి అనేకమంది భక్తులు మొక్కలు తీర్చుకునే ఒక విశిష్టత గల ఆలయమన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె జనసేన మండల పార్టీ అధ్యక్షులు త్రిమూర్తులు కుటుంబ సభ్యులు,శ్రేయోభిలాషులతో కలిసి భోజనం చేశారు. ప్రశాంతమైన వాతా వరణంలో ఇలా కాసేపు సరదాగా ఆధ్యాత్మికత్వంలో గడపటం చాలా మంచి అనుభూతి ఇస్తుందన్నారు.
కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు BNVS గుప్తా మహిళలకు, పిల్లల కు ఫన్నీ సమాధానాల క్విజ్ అందరినీ ఆకట్టుకుంది. మరియు ఆధ్యాత్మికత్వం పై నిర్వహించిన క్విజ్ ఆసక్తికరంగా సాగింది. అలాగే రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్,ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి గారు రెండు సంవత్సరాల కాలంలో సొంత నిధులతో చేసిన అభివృద్ధిపై నిర్వహించిన క్విజ్ అందరినీ ఆకట్టుకుంది.
కార్యక్రమంలో APIIC డైరెక్టర్ మండల పార్టీ అధ్యక్షులు గొల్లపూడి పెద్దిరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు గణజాల తాతారావు, AMC డైరెక్టర్ కేశిరెడ్డి శివ శంకర వర ప్రసాద్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్, మండల పార్టీ నాయకులు జెట్టి మధు, నియోజకవర్గ మహిళా విభాగం నాయకులు ముప్పన సావిత్రి, ముప్పన మోహన్, చిట్టి సుబ్బారావు, వానపల్లి చిట్టిబాబు, బచ్చా బుజ్జి సత్యనారాయణ, చెక్కా లోవరాజు, చిలకచర్ల వీరబాబు, జనసేన నియోజక వర్గ నాయకులు కుర్ల రాజశేఖర్ రెడ్డి, పాపోలు శ్రీనివాసరావు, కుప్పాల జయరాం, సాయి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




