Rampachodavaram: రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ప్రెస్ మీట్!
Rampachodavaram: పోలవరం జిల్లా రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ప్రెస్ మీట్.. తన మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వివరణ.
Rampachodavaram: రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష ప్రెస్ మీట్!
Rampachodavaram: రంపచోడవరం టీడీపీ ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ప్రెస్ మీట్ వైరల్ వీడియోలపై ఎమ్మెల్యే శిరీష వివరణ, నా మాటలను వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
ఇటీవల సోషల్ మీడియాలో తన ప్రసంగానికి సంబంధించి వైరల్ అవుతున్న వీడియోలపై వివరణ మరియు స్పష్టత ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల అబ్జర్వర్లు, సీనియర్ నాయకులతో కలిసి ప్రతి మండలంలో ఎన్నికల సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా అడ్డతీగల మండలంలో కూడా సమావేశం నిర్వహించామని చెప్పారు.
అడ్డతీగలలో కార్యకర్తలు వర్గాలుగా విడిపోయి ఉండటం వల్ల, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని మాత్రమే దిశానిర్దేశం చేశానని స్పష్టం చేశారు.
కార్యకర్తలను ఉద్దేశించి చేసిన సాధారణ వ్యాఖ్యలను వక్రీకరించి, వైసీపీ కావాలనే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని ఆమె ఆరోపించారు.
12 మండలాలు, 350 కి.మీ పైగా విస్తరించి ఉన్న నియోజకవర్గంలో ఎండనక వాననక కష్టపడి తనను గెలిపించిన కార్యకర్తలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని చెప్పారు.
తానూ ఒక సాధారణ అంగన్‌వాడీ టీచర్‌గా, కార్యకర్త కుటుంబం నుంచే వచ్చి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగానని, కార్యకర్తల కష్టసుఖాలు తనకు బాగా తెలుసని గుర్తుచేశారు.
ఒకవేళ తన మాటల వల్ల ఎవరైనా కార్యకర్తలు లేదా నాయకులు నొచ్చుకుని ఉంటే మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణలు కోరుతున్నానని పేర్కొన్నారు.
కార్యకర్తలే తన బలమని, భవిష్యత్తులో స్థానిక సంస్థలు మరియు నియోజకవర్గ విభజన తర్వాత వచ్చే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని అంతా కలిసికట్టుగా పార్టీ కోసం కష్టపడాలని పిలుపునిచ్చారు.




