Chinturu: అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే!
Chinturu: అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రంపచోడవరం ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్ మిరియాల శిరీషాదేవి పేర్కొన్నారు.
Chinturu: అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎమ్మెల్యే!
చింతూరు: రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం కు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి అన్నారు.మంగళవారం చింతూరు మండలంలో ఆమె పర్యటించారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసారు. ప్రతి ఒక్కరు టిడిపి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. పార్టీ నాయకులు మండలంలోని రహదారులు, త్రాగునీరు, విద్యుత్, విద్య, వైద్యం సమస్యలను ఎమ్మెల్యే మిర్యాల శిరీష దేవి దృష్టికి తీసుకుని వచ్చారు.
ముకునూరు, చిడుమూరు గ్రామాలలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేపట్టారు.గ్రామాల్లోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజలను నేరుగా కలుసుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
గ్రామస్తులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటిని సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో చింతూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎం.డి. జమాల్ ఖాన్, పార్టీ కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరరావు, ఓబులనేని నరసింహారావు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.




