Samarlakota: 'ఇంటింటికి తెలుగుదేశం'.. సీసీ రోడ్డును ప్రారంభించిన చినరాజప్ప!
Samarlakota: సామర్లకోట 28వ వార్డులో 'ఇంటింటికి తెలుగుదేశం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే చినరాజప్ప. 29వ వార్డులో నూతన సీసీ రోడ్డు ప్రారంభం.
Samarlakota: 'ఇంటింటికి తెలుగుదేశం'.. సీసీ రోడ్డును ప్రారంభించిన చినరాజప్ప!
Samarlakota: సామర్లకోట పట్టణ పరిధి 28వార్డులో సోమవారం నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప పాల్గొన్నారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనకు సంబంధించి అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.
అనంతరం వార్డులో మహిళల నుంచి పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కూటమి ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి,సంక్షేమం సాధ్యపడుతుందని ఎమ్మెల్యే చినరాజప్ప పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్,కూటమి నాయకులు బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, కంటే జగదీష్ మోహన్, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, సరోజ వాసు,బలుసు వాసు తదితరులు పాల్గొన్నారు.కార్యక్రమం అనంతరం 29వ వార్డులో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే చినరాజప్ప ప్రారంభించారు.




