Alamuru: ఆలమూరులో పోలీస్ శాఖ పెట్రోల్ బంక్ ప్రారంభం!

Alamuru: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతన పెట్రోల్ బంక్ ప్రారంభం. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, డీఐజీ అశోక్ కుమార్ హాజరు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 25 Aug 2026 12:55 PM IST
Alamuru
X

Alamuru: ఆలమూరులో పోలీస్ శాఖ పెట్రోల్ బంక్ ప్రారంభం!

Alamuru: ఆలమూరులో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్ బంక్‌లో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు ఉంటాయని, ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకొని పోలీస్ శాఖకు సహకరించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకు ప్రారంభోత్సవంలో ఆయన ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, కొత్తపేట డిఎస్పి సుంకర మురళీమోహన్, కొత్తపేట జనసేన ఇన్చార్జ్ బండారు శ్రీనివాస్, రావులపాలెం రూరల్ సీఐ సిహెచ్ విద్యాసాగర్, ఆలమూరు ఎస్సై జి నరేష్ తదితరులతో కలిసి పాల్గొన్నారు. పోలీసులు సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ బంకులను ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA