Rajahmundry: రాజమండ్రిలో సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ!
Rajahmundry: రాజమహేంద్రవరానికి చెందిన కెల్లా జోగేశ్ బాబు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ. 4,30,000 ఆర్థిక సహాయం మంజూరైంది.
Rajahmundry: రాజమండ్రిలో సీఎం సహాయ నిధి చెక్కు పంపిణీ!
రాజముండ్రి: ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంకు చెందిన కెల్లా జోగేశ్ బాబు వైద్య చికిత్స నిమిత్తం రూ.4,30,000 (నాలుగు లక్షల ముప్పై వేల రూపాయలు) ఆర్థిక సహాయం మంజూరైనట్లు శాసన సభ్యులు సోము వీర్రాజు తెలిపారు.
గురువారం రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీ) సోము వీర్రాజు బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని బాధితుని తరఫున ముఖ్యమంత్రి కార్యాలయానికి విజ్ఞప్తి పంపించామని, దానిపై సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైద్య చికిత్స కోసం రూ.4.30 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ ఆర్థిక సహాయం బాధిత కుటుంబానికి ఎంతో ఊరటనిస్తుందని, కెల్లా జోగేశ్ బాబు త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సాధారణ జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంబంధిత కుటుంబ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.




