Venkatayapalem: వెంకటాయపాలెంలో రేపు వైసీపీ కాపు నేతల రౌండ్ టేబుల్ భేటీ
Venkatayapalem: వెంకటాయపాలెంలో రేపు జరగబోయే వైసీపీ కాపు నేతల రౌండ్ టేబుల్ సమావేశంపై వస్తున్న విమర్శలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్రంగా ఖండించారు.
Venkatayapalem: వెంకటాయపాలెంలో రేపు వైసీపీ కాపు నేతల రౌండ్ టేబుల్ భేటీ
వెంకటాయపాలెం: వెంకటాయపాలెంలో రేపు జరుగ బోవు వైసీపీ కాపు నేతల సమావేశంపై ఎటువంటి అపోహలు విమర్శలు చేయడం తగదన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు. కేవలం వైసీపీ పార్టీ యాంగిల్ లో మాత్రమే ఈ సమావేశం నిర్వహిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పార్టీలో ఉన్న కాపు నేతలు తో మాత్రమే ఈ సమావేశం నిర్వహిస్తున్నాం.
ఈ సమావేశంపై మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ కొందరు చేస్తున్న దుష్ప్రచారాన్ని, విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. వెంకటాయపాలెం లో అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడారు.
రేపు వైసీపీకి చెందిన కాపు రాష్ట్రముఖ్య నాయకులు, నియోజకవర్గ వైసిపి ఇన్చార్జిలు(కాపు )వెంకటాయపాలెం అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. వైసిపి పార్టీని రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాల వారీగా ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అని ఆలోచనతో ఈ సమావేశం నిర్వహిస్తున్నాం.
కేవలం పార్టీ యాంగిల్ లో మాత్రమే ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. ఈ సమావేశానికి పెద్దలు బొత్స సత్యనారాయణ, ఇతర నాయకులు హాజరుకానున్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాగోలేనందున ఆయన మాత్రం ఈ సమావేశానికి హాజరు కారు.
పార్టీ అధిష్టానానికి ఈ సమావేశానికి ఎటువంటి సంబంధం లేదని కేవలం నా ఆలోచన మేరకే ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో మరోసారి కూడా తన పార్టీకి చెందిన కాపు నేతలు కలుస్తాం.




