Konaseema: మోహిని అలంకరణలో కనువిందు చేసిన కోనసీమ తిరుమలేశుడు

Konaseema: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు స్వామివారు మోహిని అలంకరణలో చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

TRIMURTULU, KOTHAPETA
Published on: 3 Nov 2026 7:33 PM IST
Konaseema
X

Konaseema: మోహిని అలంకరణలో కనువిందు చేసిన కోనసీమ తిరుమలేశుడు

Konaseema: కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి 14వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు మంగళవారం చంద్రప్రభ వాహన సేవ వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారు మోహిని అలంకరణలో చంద్రప్రభ వాహనంపై కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకరణలో చంద్రప్రభ వాహనంపై విహరిస్తున్న స్వామివారిని దర్శించుకున్న భక్తజనం

ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం స్వస్తివాచనం, ప్రధాన హోమాలు, హనుమత్ మూలమంత్ర హవనం, దిగ్దేవతా బలిహరణ, అష్టోత్తర శత కలశారాధన, పంచశయ్యాధివాసం తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఏకాంత సేవ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA