Amalapuram: 2వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ హరీష్ బాలయోగి!
Amalapuram: అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు పోలింగ్ కేంద్రంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి తన ఓటు హక్కును వినియోగించుకుని ప్రజలందరూ ఓటేయాలని పిలుపునిచ్చారు.
Amalapuram: 2వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న ఎంపీ హరీష్ బాలయోగి!
Amalapuram: అమలాపురం మున్సిపాల్ ఎలక్షన్ లో 2వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎంపీ హరీష్ బాలయోగి. నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మనందరికీ కల్పించినటువంటి అతి పవిత్రమైన ఓటు ను నేను ఈరోజు వినియోగించుకోవడం జరిగింది.నా ఓటు హక్కును నేను వినియోగించుకోవడం జరిగింది అని ఎంపీ అన్నారు.ఈరోజు నేను ప్రత్యక్షంగా రెండో వార్డ్ బూతుకెళ్లి ఓటు ను వేయడం జరిగింది.
అమలాపురం పార్లమెంటు పరిధిలో ఉన్న ప్రతి ఓటర్ కూడా మీ అమూల్యమైన ఓటును వినియోగించుకుని అభివృద్ధికి పట్టం కడతారని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూన్నాను అని ఎంపీ హరీష్ బాలయోగి కొనియాడారు.
అమలాపురం నియోజకవర్గ పరిధిలోని అమలాపురం మున్సిపాలిటీ 2వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్న అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్,మున్సిపల్ రెండో వార్డు అభ్యర్థి కుంచె వెంకన్నబాబు, అయితా బత్తుల మధుబాబు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.




