Amalapuram: కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశ ఎంపీ హరీష్ బాలయోగి!

Amalapuram: కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి కలిశారు. కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ మరియు విజయవాడ ఉత్సవ్‌పై చర్చించారు.

SURESH, AMALAPURAM
Published on: 7 Oct 2026 9:47 AM IST
Amalapuram
X

Amalapuram: కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిశ ఎంపీ హరీష్ బాలయోగి!

Amalapuram: కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో అమలాపురం ఎంపీ హరీష్ బాలయోగి, విజయవాడ కేశినేని చిన్ని,ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలసి కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0 మరియు దసరా ఉత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానం పలికారు.అలాగే కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ గురించి, ఈ ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన రూ.100 కోట్ల వాటా గురించి చర్చించినట్లు, రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని మంత్రి వైష్ణవ్ అభినందించారని తెలిపారు.

కోటిపల్లి - నరసాపురం రైల్వే లైన్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తదుపరి కార్యాచరణపై చర్చించామన్నారు.కేంద్రంలో మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాల నిరంతర మద్దతుతో,కోనసీమ ప్రజలకు ముఖ్యమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి కలిసి పని చేస్తామని ఈ సందర్భంగా హరీష్ బాలయోగి తెలియజేశారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM