Konaseema: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ, మంత్రి

Konaseema: ఈనెల 9న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. అంబాజీపేటలో ఏర్పాట్లను ఎంపీ హరీష్ బాలయోగి, మంత్రి వాసంశెట్టి సుభాష్ పరిశీలించారు.

SURESH, AMALAPURAM
Published on: 6 Sept 2026 4:33 PM IST
Konaseema
X

Konaseema: కోనసీమలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన ఎంపీ, మంత్రి

Konaseema: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్ల సమావేశంలో ఎంపీ హరీష్ బాలయోగి పాల్గొన్నారు.అమలాపురం రూరల్ మండలం అంబాజీపేటలో ఈనెల 9 వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన జరుగనున్న నేపథ్యంలో అంబాజీపేటలో జరిగిన సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొని పలు సూచనలు జరిచేసారు.

ఈ సమావేశంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 9న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను ఎంపీ హరీష్ బాలయోగి,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆదివారం పరిశీలించారు.

పి.గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ,ఇతర ప్రజాప్రతినిధులు,కూటమి నాయకులతో కలిసి సీఎం పర్యటించే ప్రాంతాలను సందర్శించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంతో పాటు పార్టీ కేడర్ సమావేశంలో పాల్గొననున్న నేపథ్యంలో సభా ప్రాంగణం, హెలీప్యాడ్, భద్రతా ఏర్పాట్లు, రాకపోకల మార్గాలను మంత్రి పరిశీలించారు.

అనంతరం పి.గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేటలో ప్రజాప్రతినిధులు,పార్టీ నాయకులతో సమావేశమై పర్యటన విజయవంతానికి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి,రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.ఈ నెల 9న ఆత్రేయపురం మండలం లొల్ల గ్రామంలో రూ.72 కోట్లతో చేపట్టనున్న లొల్లా లాకుల ఆధునీకరణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నట్లు తెలిపారు.

అలాగే రైతులకు రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికారులు,ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఎంతో ప్రాధాన్యత కలిగిన ఈ పర్యటనను ప్రజలందరూ భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్థానిక పి. గన్నవరం ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ,ఎంపీ హరీష్బాలయోగి,జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి,జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు,మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్,మండల పార్టీ అధ్యక్షులు,క్లస్టర్ ఇన్‌చార్జులు,కూటమి నాయకులు,కార్యకర్తలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story