Mummidivaram: మంద కృష్ణ మాదిగ సేవలు స్ఫూర్తిదాయకం మండల అధ్యక్షుడు!
Mummidivaram:
Mummidivaram: మంద కృష్ణ మాదిగ సేవలు స్ఫూర్తిదాయకం మండల అధ్యక్షుడు!
ముమ్మిడివరం: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్) 32వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ శ్రీ మంద కృష్ణ మాదిగ గారి 61వ జన్మదిన వేడుకలను ముమ్మిడివరం పోలమ్మ చెరువుగట్టు వద్ద ఘనంగా నిర్వహించారు.
ముమ్మిడివరం ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు లంక వరప్రసాద్ ఆధ్వర్యంలో, కండవల్లి ఏలీయా అధ్యక్షతన అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను నిర్వహించారు. అనంతరం భారీ ర్యాలీ చేపట్టి మంద కృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మాట్లాడుతూ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి 32 సంవత్సరాలుగా సామాజిక న్యాయం, మాదిగల హక్కుల పరిరక్షణ, రిజర్వేషన్ సాధన కోసం పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు.
ఆయన సేవలు మాదిగ సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, ఆయురారోగ్యాలతో మరెన్నో సంవత్సరాలు ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో దాట్ల పృథ్వీరాజు, గుద్దటి జమ్మి, కాట్రేనికోన ఇన్చార్జ్ దాట్ల పవన్, విహెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నలామాటి లంకరాజు, ఎంఆర్పీఎస్ నాయకులు, మంద కృష్ణ మాదిగ అభిమానులు, మహిళలు, యువకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.




