Mummidivaram: స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి - బొలిశెట్టి శ్రీనివాస్

Mummidivaram: ముమ్మిడివరంలో జనసేన కార్యకర్తల సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Sept 2026 10:46 PM IST
Mummidivaram
X

Mummidivaram: స్థానిక ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి - బొలిశెట్టి శ్రీనివాస్

ముమ్మిడివరం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, జనసేన అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ స్థానిక సంస్థల కో-ఆర్డినేటర్ బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.

ముమ్మిడివరంలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన ఎన్నికల కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని క్షేత్రస్థాయిలో సమన్వయంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అధికారంలో భాగస్వామిగా ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు బాధ్యతతో పనిచేయాలన్నారు.

పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడుతున్న కార్యకర్తలను అధిష్టానం తప్పక గుర్తిస్తుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల్లో జనసేన విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు, మండల స్థాయి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్