Mummidivaram: ముమ్మిడివరంలో పోషకాహార మాసోత్సవాలు: సీడీపీఓ నిహారిక
Mummidivaram: ముమ్మిడివరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో జాతీయ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా సమతుల్య ఆహారంపై సీడీపీఓ నిహారిక అవగాహన కల్పించారు.
Mummidivaram: ముమ్మిడివరంలో పోషకాహార మాసోత్సవాలు: సీడీపీఓ నిహారిక
ముమ్మిడివరం: జాతీయ పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా ముమ్మిడివరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ప్రజలకు పోషకాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీడీపీఓ నిహారిక తెలిపారు.
సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నెలరోజుల పాటు గ్రామాలు, ఇంటింటా పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయం, బీపీ, మధుమేహం తదితర అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు ఆహారం తయారీ విధానంలోనూ తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆహారంలో తెలుపు రంగు పదార్థాలను తగ్గించి, వివిధ రంగుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు.
బియ్యంతో పాటు తృణధాన్యాలు, మొలకెత్తిన ధాన్యాలు, నట్స్, సీడ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. చక్కెర, మైదా వంటి పదార్థాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా ఊబకాయం, రక్తహీనత తదితర సమస్యలను నియంత్రించవచ్చన్నారు.
ప్రజలందరి ఆరోగ్యం మన బాధ్యత’ అనే లక్ష్యంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న పోషకాహార మాసోత్సవాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లేందుకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది కృషి చేస్తున్నారని సీడీపీఓ నిహారిక తెలిపారు.




