Mummidivaram: ముమ్మిడివరంలో హజరత్ ఇమామ్ హుస్సేన్ అర్బఇన్ వేడుకలు!
Mummidivaram: ముమ్మిడివరంలో అంజుమన్ జైనబియా ఆధ్వర్యంలో ఇమామ్ హుస్సేన్ అర్బఇన్ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహణ. పాల్గొన్న సుదూర ప్రాంతాల భక్తులు.
Mummidivaram: ముమ్మిడివరంలో హజరత్ ఇమామ్ హుస్సేన్ అర్బఇన్ వేడుకలు!
ముమ్మిడివరం: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం లోని అంజుమన్ జైనబియా ఆధ్వర్యంలో హజరత్ ఇమామ్ హుస్సేన్ (అలైహిస్సలాం) అర్బఇన్ (40వ రోజు) కార్యక్రమాలు ఆదివారం భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా మాతం నిర్వహించగా, సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం పంజా నుంచి గుమ్మటం ఊరేగించారు. కార్యక్రమంలో మత ప్రబోధకులు మొహమ్మద్ అలీ జాఫరి మజ్లీస్ నిర్వహించి హజరత్ ఇమామ్ హుస్సేన్ త్యాగం, సందేశాన్ని వివరించారు.
కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో ముగియగా, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై నివాళులర్పించారు.
Next Story




