Mummidivaram: ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ రాహుల్ మీనా

Mummidivaram: ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రాహుల్ మీనా.

SURESH, AMALAPURAM
Published on: 13 Aug 2026 10:44 PM IST
Mummidivaram
X

Mummidivaram: ముమ్మిడివరం పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ రాహుల్ మీనా

ముమ్మిడివరం: ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ కార్యాలయ పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఎస్పీ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న వాహనాలను చూసి వాటి వివరాలు తెలుసు కున్నారు, వాహనాలను వీలయినంత తొందరగా చట్టప్రకారం వాటి యజమానులకు అప్పగించడం, వీలుకాని వాహనాలను చట్ట ప్రకారం ఆక్షన్ నిర్వహించడం చేయాలనీ,వాహనాలను ఎక్కువ రోజులు స్టేషన్ లో ఉంచవద్దు అని ఎస్ ఐ ఆదేశాలు జారీ చేశారు.అదే విధంగా స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని,ప్రజలు ఫిర్యాదులు ఇవ్వడానికి వచ్చినప్పుడు వారికి స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సూచించారు.

కేసుల సమీక్ష: ఎస్పీ ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసులు మరియు స్టేషన్ పరిధిలో ఉండే శాంతి భద్రత లకు సంబంధించిన విషయాలను సర్కిల్ ఇన్స్పెక్టర్ ను అడిగి తెలుసుకుని సూచనలు ఇచ్చారు.మహిళలు, పిల్లలు పై జరిగే ఘటనలు కు సంబంధిన కేసుల దర్యాప్తులో వేగం పెంచి బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని ఆదేశించారు.

ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న లైవ్ ఇష్యూస్ ను ఇతర డిపార్ట్మెంట్లతో కలుపుకుని,శాంతి కమిటీనల ను ఏర్పాటు చేసుకుని ఇరు వర్గాల ప్రజలతో చర్చించుకుని సమస్యను పరిష్కరించాలని సూచించినారు.ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవే రోడ్ మీద ఉన్న బ్లాక్ స్పాట్లను గుర్తించి వాటిని ఇతర డిపార్ట్మెంట్ల తో కలిపి పరిశీలించి ఆ ప్రదేశంలో కావలసిన లైట్స్ ,రేడియం స్టిక్కరింగ్ మరియు స్పీడును నియంత్రించే అవరోధాలను ఏర్పాటుచేసి రోడ్ యాక్సిడెంట్ తగ్గించడానికి కృషి చేయాల్సిందిగా సూచించినారు.

ముమ్మిడివరం స్టేషన్ పరిధిలో ఉన్న విగ్రహాలు గురించి, రాబోయే వినాయక చవితి సందర్భంగా కమిటీ సభ్యులుతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వినాయక చవితి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకునేట్లు సూచనలు ఇవ్వాలని ఎస్పీ తెలిపినారు. ముఖ్యమైన జంక్షన్ లలో మరియు విగ్రహాలు వద్ద వీలైనంతవరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని సూచించినారు.

సిబ్బందితో ముఖాముఖి

ముమ్మిడివరం ఇన్స్పెక్టర్ , ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ మరియు ఇతర సిబ్బందితో ఎస్పీ మాట్లాడి సిబ్బంది సమస్యలు గురించి మరియు విధి నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు, శాంతిభద్రతల పరిరక్షణ మరియు ప్రజలకు అందుబాటులో ఉండటంపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.బి.సీఐ పుల్లారావు ముమ్మిడివరం సీఐ ఎం.మోహన్ కుమార్, ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ ఎస్. ఐ బి. శివకృష్ణ, స్టేషన్ సిబ్బంది ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story