Rajahmundry: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: రాహుల్ మీనా!

Rajahmundry: రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ (PGRS)లో కమిషనర్ రాహుల్ మీనా 21 అర్జీలను స్వీకరించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 10 Aug 2026 11:09 PM IST
Rajahmundry
X

Rajahmundry: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం: రాహుల్ మీనా!

రాజమండ్రి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)కు వచ్చే అర్జీలపై ప్రతీరోజు సమీక్షించుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు.

నగరపాలక సంస్థ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 21 అర్జీలు రాగా వీటిలో ఇంజనీరింగ్ కి సంబంధించి 7, రెవెన్యూకి సంబంధించి 4, టౌన్ ప్లానింగ్ కి సంబంధించి 5, పబ్లిక్ హెల్త్ కి సంబంధించి 2, వార్డు సచివాలయాలకు సంబంధించి 3 ఉన్నాయి.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవాలనే ఆశతో అధికారులను ఆశ్రయిస్తున్నారని, వారి అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, అత్యంత ప్రాధాన్యతతో సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

అర్జీలను బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించడంతో పాటు, పరిష్కారం సాధ్యంకాని అంశాలపై స్పష్టమైన కారణాలను అర్జీదారులకు తెలియజేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ముందంజలో ఉండేలా, ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.

అలాగే పెండింగ్ లో ఉన్న అర్జీలను విభాగాల వారీగా సమీక్షించి, వాటి పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలన్నారు. ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పెరిగేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎస్ఈ రీటా, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్.మూర్తి, ఎంహెచ్ఓ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, రెవిన్యూ అధికారి సీహెచ్ శ్రీనివాసరావు, అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story