Rajahmundry: తుఫాను తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Rajahmundry: రాజమండ్రి నగరంలో అర్నాబ్ తుఫాను ప్రభావంపై కమిషనర్ రాహుల్ మీనా క్షేత్రస్థాయి పరిశీలన. 20 కూలిన చెట్ల తొలగింపు, కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ.
Rajahmundry: తుఫాను తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
Rajahmundry: తుఫాన్ ప్రభావంతో నగరంలో జన జీవనానికి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. బుధవారం ఉదయం హైటెక్ బస్టాండ్, నారాయణపురం సహా పలు ప్రాంతాలలో ఆయన విస్తృతంగా పర్యటించారు.
రోడ్లపై ఎక్కడా నీరు నిలవకుండా మోటర్ల సాయంతో వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే భారీ వర్షాలకు కూలిన చెట్ల తొలగింపు పనులను పరిశీలించారు. మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు దాదాపు 20 కూలిన చెట్లను సిబ్బంది తోడ్పాటుతో, క్రేన్ల సాయంతో యుద్ధప్రాతిపదికన తొలగించినట్లు అధికారులు కమిషనర్ కు తెలిపారు.
ఈదురుగాలులకు ఇంకా రహదారులపై చెట్లు కూలే అవకాశం ఉందని.. అటువంటి వాటిని జాప్యం లేకుండా తొలగించాలన్నారు. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా యంత్రాలు, సిబ్బందిని సిద్ధం చేయడంతోపాటు పారిశుధ్య పనులు నిరంతరాయంగా కొనసాగించాలన్నారు.
ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అలాగే తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అధికారుల సూచనలు, వాతావరణ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం నగరపాలక కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షించారు.




