Rajahmundry: అన్న క్యాంటీన్‌లో కమిషనర్ రాహుల్ మీనా ఆకస్మిక తనిఖీ!

Rajahmundry: పేదలకు అందించే భోజనం నాణ్యతగా, పరిశుభ్రంగా ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 2 July 2026 12:42 PM IST
Rajahmundry
X

Rajahmundry: అన్న క్యాంటీన్‌లో కమిషనర్ రాహుల్ మీనా ఆకస్మిక తనిఖీ!

రాజమండ్రి: పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని కమిషనర్ రాహుల్ మీనా స్పష్టం చేశారు.

గురువారం జీజీహెచ్ సమీపంలోని అన్నా క్యాంటీన్ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలు వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు తాగునీరు అందించే ఏర్పాట్లను పరిశీలించారు.

అల్పాహారం తీసుకుంటున్న ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి.. క్యాంటీన్ సమయానికి తెరుస్తున్నారా..? ఆహార పదార్థాల నాణ్యత ఎలా ఉంది..? ఏమైనా ఫిర్యాదులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలు QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా తెలియజేయవచ్చన్నారు.

అనంతరం నిర్వాహకులతో మాట్లాడుతూ.. రోజుకు ఎంతమంది క్యాంటీన్ కు వస్తారో ఆరా తీశారు. ప్రజలకు సకాలంలో నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని.. క్యాంటీన్ పరిసరాల్లో స్వచ్ఛతా నియమాలు పాటించాలన్నారు.

ఆర్వో వాటర్ ఫిల్టర్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఉండాలని.. వేడి నీళ్లలోనే పాత్రలు, ప్లేట్లు కడగాలన్నారు. ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు.

అలాగే క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి నోడల్ అధికారుల నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

ఆయన వెంట ఎంహెచ్ఓ వినూత్న, ఇతర సిబ్బంది ఉన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

Next Story