Muramalla: రూ.14 కోట్లతో మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు

Muramalla: కోనసీమ జిల్లా మురమళ్ల ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. కృష్ణశిలలకు ప్రత్యేక పూజలు. దాతల నుండి భారీ విరాళాలు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 July 2026 3:52 PM IST
Muramalla
X

Muramalla: రూ.14 కోట్లతో మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు

మురమళ్ల: మురమళ్లలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు రూ.14 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ మహత్తర పునర్నిర్మాణ కార్యక్రమానికి భారీ కృష్ణశిలలు ఆలయానికి చేరుకుంటుండగా, దాతలు కూడా పెద్ద ఎత్తున విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు.

నిత్య కల్యాణం పచ్చతోరణంగా ప్రసిద్ధి చెందిన మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) పర్యవేక్షణలో సుమారు రూ.14 కోట్ల వ్యయంతో ఆలయాన్ని అత్యద్భుతమైన రాతి కట్టుబడితో పునర్నిర్మిస్తున్నారు.......

శైవాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించగా, నిర్మాణానికి సంబంధించిన బేస్‌మెంట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. గర్భగుడి నిర్మాణం కోసం ఇప్పటికే ఐదు లారీల భారీ కృష్ణశిలలు ఆలయానికి చేరుకోగా, వాటికి సంబంధించిన స్టోన్ కటింగ్, గ్రైండింగ్ పనులు కొనసాగుతున్నాయి.

దైవకార్యానికి భక్తులు, దాతలు విశేషంగా స్పందిస్తూ విరాళాలు అందిస్తున్నారు. లక్ష రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ విరాళం అందించిన దాతల పేర్లను శిలాఫలకంపై పొందుపరుస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు.

మంగళవారం రాత్రి ఆలయానికి చేరుకున్న భారీ కృష్ణశిలకు ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు, ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు, అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ, ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ, అర్చకులు, పురోహితులు, వేద పండితులు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ చైర్మన్ శ్రీ దాట్ల రామకృష్ణం రాజు, అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ పునర్నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వేగవంతంగా పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story