Mamidikuduru: నగరంలో బీబీ సకీనా షహదత్ మజిలీస్‌ లకు ఏర్పాట్లు

Mamidikuduru: మామిడికుదురు మండలం నగరం గ్రామంలోని బీబీ సకీనా పంజా వద్ద మొహరం వేడుకలకు ఏర్పాట్లు. భక్తులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని వెల్లడించిన నిర్వాహకులు.

PRABHU, RAZOLE
Updated on: 16 July 2026 2:25 PM IST
Mamidikuduru
X

Mamidikuduru: నగరంలో బీబీ సకీనా షహదత్ మజిలీస్‌ లకు ఏర్పాట్లు

మామిడికుదురు: మొహరం సంతాప కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, నగరం గ్రామంలోని బీబీ సకీనా పంజా నందు నిర్వహించనున్న బీబీ సకీనా షహదత్ మజిలీస్‌లకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను నిర్వాహకులు విడుదల చేశారు.

నగరం సంఘ అంజుమన్ అధ్యక్షులు ఆబిద్ అలీ మాట్లాడుతూ, హజరత్ ఇమామ్ హుస్సేన్ తనయురాలు బీబీ సకీనా వర్ధంతి సందర్భంగా నిర్వహించే మజిలీస్‌ లను నిండుశోకంతో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

షియా మసీదులో ప్రత్యేక మజిలీస్‌లు నిర్వహించనున్నట్లు తెలిపారు.అమలాపురం లో జరిగే మజిలీస్ లకు కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story