Nagaram: నగరంలో విద్యార్థులకు విశ్రాంత ఉపాధ్యాయుడు ఆర్థిక సాయం!

Nagaram: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నగరం జడ్పీ హైస్కూల్ విద్యార్థులకు విశ్రాంత హెచ్ఎం మహమ్మద్ లియాఖత్ అలీ రూ.36 వేల ఆర్థిక సాయం అందజేశారు.

PRABHU, RAZOLE
Published on: 5 Aug 2026 9:21 AM IST
Nagaram
X

Nagaram: నగరంలో విద్యార్థులకు విశ్రాంత ఉపాధ్యాయుడు ఆర్థిక సాయం!

Nagaram: విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, నగరం గ్రామానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ లియాఖత్ అలీ కోరారు. స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.26,000 విలువైన బ్యాంకు డిపాజిట్ పత్రాన్ని ప్రధానోపాధ్యాయులు సోమేశ్వరరావుకు అందజేశారు. ఈ డిపాజిట్‌పై వచ్చే వడ్డీని ప్రతి ఏడాది క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులుగా అందజేయాలని సూచించారు.

అలాగే, విలువిద్య పోటీలకు వెళ్లే విద్యార్థులకు అవసరమైన క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. గ్రామానికి చెందిన పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని భవిష్యత్తులో కూడా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story