Mamidikuduru: పాఠశాలకు రూ.4.50 లక్షల ఆర్‌వో ప్లాంట్ విరాళం!
Mamidikuduru: నగరం జడ్పీహెచ్ స్కూల్‌లో రూ.4.50 లక్షలతో ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థి మండెల బాబి. 250 మంది విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు.
Mamidikuduru: పాఠశాలకు రూ.4.50 లక్షల ఆర్‌వో ప్లాంట్ విరాళం!
Mamidikuduru: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, మామిడికుదురు మండలం, నగరం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే ఉద్దేశంతో జడ్పీహెచ్ స్కూల్ పూర్వ విద్యార్థి మండెల బాబి ముందుకొచ్చారు. తన సొంత నిధులతో రూ.4.50 లక్షలు వెచ్చించి పాఠశాల ఆవరణలో ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. దీంతో జడ్పీహెచ్ స్కూల్‌తో పాటు మోడల్ ప్రైమరీ స్కూల్‌లో చదువుతున్న సుమారు 250 మంది విద్యార్థులకు శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులోకి వచ్చింది.
తాను విద్యాభ్యాసం చేసిన పాఠశాలలోని విద్యార్థులకు ఉపయోగపడేలా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించడం అభినందనీయమని పాఠశాల హెచ్‌ఎం పాల సోమేశ్వరరావు తెలిపారు.
తన తండ్రి వీరాస్వామి నాయుడు స్మారకార్థం ఈ ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని బాబి పేర్కొన్నారు. పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు తమకు తోచిన విధంగా పాఠశాల అభివృద్ధికి సహకరించాలని ఉపాధ్యాయులు కోరారు. విద్యార్థుల అవసరాన్ని గుర్తించి ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసిన బాబిని పాఠశాల సిబ్బంది అభినందించారు.




