P Gannavaram: నగరం ఏఎంసీ చైర్‌పర్సన్ లక్ష్మీ బాలరాజు జన్మదిన వేడుకలు

P Gannavaram: పి. గన్నవరం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నగరం ఏఎంసీ చైర్‌పర్సన్ శ్రీమతి పెనుమాల లక్ష్మీ బాలరాజు జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

RAJU, P GANNAVARAM
Published on: 8 July 2026 8:33 AM IST
P Gannavaram
X

P Gannavaram: నగరం ఏఎంసీ చైర్‌పర్సన్ లక్ష్మీ బాలరాజు జన్మదిన వేడుకలు

P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద నగరం ఏఎంసీ చైర్పర్సన్ శ్రీమతి పెనుమాల లక్ష్మీ బాలరాజు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే ముందుగా కేక్ కట్ చేసి శ్రీమతి పెనుమాల లక్ష్మీ బాలరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, ప్రజాప్రతినిధులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీమతి పెనుమాల లక్ష్మీ బాలరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM

Next Story