Konaseema: 700 శ్లోకాలు కంఠస్థం.. మామిడికుదురు మహిళకు దత్త పీఠం బంగారు బహుమతి!
Konaseema: కోనసీమ జిల్లా మామిడికుదురుకు చెందిన నైనాల వీరవేణి భగవద్గీతలోని 18 అధ్యాయాల 700 శ్లోకాలను కంఠస్థం చేసి ఆన్‌లైన్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించారు.
Konaseema: 700 శ్లోకాలు కంఠస్థం.. మామిడికుదురు మహిళకు దత్త పీఠం బంగారు బహుమతి!
Konaseema: ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటే ఎంతటి కార్యాన్నైనా సునాయాసంగా సాధించవచ్చని నిరూపించింది మామిడికుదురు గ్రామానికి చెందిన నైనాల వీరవేణి... ఆన్లైన్ ద్వారా నిర్వహించిన భగవద్గీత పారాయణం పోటీలో పాల్గొని వీరవేణి అద్భుతమైన ప్రతిభ కనబరిచి ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలు అందుకుంది. భగవద్గీత లోని 18 అధ్యాయాలు, 700 శ్లోకాలను నేర్చుకుని ఆన్లైన్ పరీక్షలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి మైసూర్ అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామిజీ చేతులు మీదుగా బంగారు బహుమతి అందుకున్నారు. భగవద్గీత శ్లోకాలను అవపోషణ పట్టి ఆన్లైన్ పరీక్షలో బంగారు బహుమతి పొందిన వీరవేణిని మామిడికుదురు శివాలయంలో ఆద్యాత్మిక సంఘాల మహిళలు ఘనంగా సత్కరించారు.
Next Story




