Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాతీయ డాక్టర్ల దినోత్సవం
Razole: రాజోలు డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.సి. రాయ్ జయంతి వేడుకలు. ప్రిన్సిపాల్ డాక్టర్ సాయిబాబు ఆధ్వర్యంలో ప్రముఖ వైద్యులకు ఘన సత్కారం.
Razole: రాజోలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాతీయ డాక్టర్ల దినోత్సవం
రాజోలు: డాక్టర్ .బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.సి. రాయ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ డాక్టర్స్ దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సాయిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తాటిపాకకు చెందిన డాక్టర్ ఎం.ఎం. హుస్సేన్, లక్కవరం పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ డి. భావన, డాక్టర్ లీలాశృతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ ఎం.ఎం. హుస్సేన్ మాట్లాడుతూ, సమాజంలో వైద్యుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తూ దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించి సమాజానికి సేవ చేయాలని సూచించారు. విద్యార్థులు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు ఉన్నత విద్యను అభ్యసించి సేవాభావాన్ని పెంపొందించుకోవాలని హితవు పలికారు.
డాక్టర్ డి. భావన మాట్లాడుతూ, సమాజానికి మంచి వైద్యులు అందించడంలో గురువుల ప్రోత్సాహం ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమను ఆహ్వానించి సత్కరించిన కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ బోస్, పీఆర్వో నల్లి రాజు, శైలజ, అశ్విని, కళ్యాణి, అధ్యాపకులు మరియు విద్యార్దినీ విద్యార్థులు పాల్గొన్నారు.




