Pega: పేగలో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం

Pega: చింతూరు మండలం పేగ ఎంపీటీసీ అభ్యర్థి సున్నం పార్వతి, జడ్పీటీసీ అభ్యర్థి తీగల కవిత గెలుపును కాంక్షిస్తూ కూటమి నేతలు అల్లిగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 29 Oct 2026 2:32 PM IST
Pega
X

Pega: పేగలో కూటమి అభ్యర్థుల తరఫున విస్తృత ప్రచారం

చింతూరు: పేగ ఎంపీటీసీ అభ్యర్థి సున్నం పార్వతి, జడ్పీటీసీ అభ్యర్థి తీగల కవిత గెలుపు కోరుతూ కూటమి నాయకులు పేగ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్లిగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.మాజీ మండల అధ్యక్షుడు ఇల్లా చిన్నారెడ్డి, సీనియర్ నాయకుడు సయ్యద్ ఆసిఫ్, సొసైటీ అధ్యక్షుడు సరియం చిట్టిబాబు నాయకత్వంలో ఈ ప్రచారం జరిగింది.

ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఇస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించారు.సున్నం పార్వతిని గెలిపిస్తే పేగలో అంతర్గత రోడ్ల సమస్య తీరుతుందని, గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణాన్ని పట్టించుకోలేదని వారు తెలిపారు.ఈ ప్రచారంలో ఎంపీటీసీ అభ్యర్థి సున్నం పార్వతి, నాయకులు గుంజ రఘువరన్, తునికి సత్యం, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR