Amalapuram: అమలాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరడం ఖాయం: ఎమ్మెల్యే

Amalapuram: అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా నల్లా శ్రీధర్ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావుతో కలిసి భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 19 Oct 2026 9:16 PM IST
Amalapuram
X

Amalapuram: అమలాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరడం ఖాయం: ఎమ్మెల్యే

అమలాపురం: అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఆనందరావు తో కలిసి అంగరంగ వైభవంగా నామినేషన్ దాఖలు చేసిన నల్లా శ్రీధర్ నేను మాటల ఎమ్మెల్యేను కాదు నేను చేతల ఎమ్మెల్యేను అని ఎమ్మెల్యే ఆనందరావు అని వ్యాఖ్యానిచ్చారు.

అమలాపురం మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ నల్లా శ్రీధర్ అక్టోబర్ 18న స్థానిక గడియార స్తంభం వద్ద నుండి ఎమ్మెల్యే ఆనందరావు తో కలిసి కాలినడకన భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేశారు.

తెలుగుదేశం,జనసేన,బిజెపి కూటమి నాయకులు,వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు అత్యంత ఉత్సాహంగా తరలివచ్చిన ఈ ప్రదర్శన అమలాపురం పట్టణంలో జాతరను తలపించింది. మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నల్లా శ్రీధర్ ఎమ్మెల్యే ఆనందరావు లతో కలసి నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ నల్లా శ్రీధర్ విజయం ఇప్పటికే ఖాయమైంది,మేము కేవలం అఖండ మెజారిటీ కోసమే చూస్తున్నాం. శ్రీధర్ అభ్యర్థిత్వాన్ని గెలిపించడానికి కూటమి నాయకులు,కార్యకర్తలు, అభిలాషులు ప్రతీ ఒక్కరూ సైనికుల్లా కదిలి మనమందరం కలిసి కృషి చేయాలి.

నియోజకవర్గంలో నేను చేసిన పనులు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల్ నాయకత్వంలో జరుగుతున్న అపూర్వమైన అభివృద్ధి,సంక్షేమాన్ని చూసి ప్రజలు మున్సిపాలిటీలో కూటమికి తిరుగులేని విజయాన్ని అందిస్తారు.అమలాపురం పట్టణాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది.

తాగునీటి పథకాల కోసం ఇప్పటికే రూ.12 కోట్ల నిధులు తీసుకువచ్చాం.భవిష్యత్తులో మరో రూ.80 కోట్లతో శాశ్వత తాగునీటి సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.అలాగే పట్టణంలో సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు కోసం రూ.60 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం అని స్పష్టం చేశారు.గత పాలకులు ఐదేళ్లలో రోడ్ల వెడల్పు చేయడంలో గానీ,ట్రాఫిక్ నియంత్రణలో గానీ,డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో గానీ దారుణంగా విఫలమయ్యారని ఎండగట్టారు.

నేను మాటల ఎమ్మెల్యేను కాదు చేతల ఎమ్మెల్యేను అనీ అభివృద్ధి పనులే మా ప్రాధాన్యత.అమలాపురంలోని 36 వార్డుల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సేవ చేస్తాం అని ఎమ్మెల్యే ఆనందరావు భరోసా ఇచ్చారు.కూటమి అభ్యర్థి నల్లా శ్రీధర్ మాట్లాడుతూ

తనపై నమ్మకంతో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి, ప్రధాని నరేంద్ర మోడీ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.తన వెంట కాలినడకన భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయించిన ఎమ్మెల్యే ఆనందరావు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అమలాపురం మున్సిపాలిటీలోని 36 వార్డులలో పోటీ చేస్తున్న కూటమి (తెలుగుదేశం,జనసేన,బిజెపి) కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు,చైర్‌పర్సన్‌గా తనను అఖండ మెజారిటీతో గెలిపించాలని,ఎమ్మెల్యే సహకారంతో అమలాపురాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ మహానామినేషన్ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు ప్రజలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM