Nidadavolu: మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన నిడదవోలు దస్తావేజుల లేఖర్ల సంఘం ప్రతినిధులు
Nidadavolu: నిడదవోలులో మంత్రి కందుల దుర్గేష్‌ను కలిసిన దస్తావేజుల లేఖరుల సంఘం ప్రతినిధులు. జీవో 396 రద్దు కోరుతూ వినతిపత్రం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ.
Nidadavolu: మంత్రి కందుల దుర్గేష్ ను కలిసిన నిడదవోలు దస్తావేజుల లేఖర్ల సంఘం ప్రతినిధులు
నిడదవోలు: ప్రజలకు మెరుగైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. మంగళవారం మంత్రి కందుల దుర్గేష్ ను నిడదవోలు దస్తావేజుల లేఖర్ల సంఘం ప్రతినిధులు కలిసి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
గత కొన్ని దశాబ్దాలుగా తాము లేఖర్ల వృత్తిలో ఉన్నామని, ప్రజల ఆస్తులకు సంబంధించి, క్రయ విక్రయాలకు సంబంధించి ఎంతో సేవలు నిర్వర్తిస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం విడుదల చేసిన జీవో వల్ల తమకు, డీటీపీ ఆపరేటర్ల మనుగడకు ప్రమాదం ఏర్పడే అవకాశమున్న నేపథ్యంలో తాము పెన్ డౌన్ కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో లేఖర్ల విజ్ఞప్తి మేరకు ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని,కొందరు చేసే దుష్ప్రచారాలను నమ్మవద్దని మంత్రి దుర్గేష్ వారికి తెలిపారు.




