Jallivaripeta: కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఎమ్మెల్యే ఆనందరావు
Jallivaripeta: ఎస్.యానాంలో జోరువానలోనూ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు కూటమి ఎన్నికల ప్రచారం చేపట్టారు. జల్లివారిపేటకు చెందిన 10 మంది టీడీపీలో చేరారు.
Jallivaripeta: కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఎమ్మెల్యే ఆనందరావు
Jallivaripeta: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు సమక్షంలో టీడీపీలో జల్లివారిపేటకు చెందిన 10 మంది చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆనందరావు ఎస్.యానాంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు.
కూటమి జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా గ్రామంలో పర్యటించి, కూటమి ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన,సుపరిపాలన మరియు అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించారు.నియోజకవర్గం వేగవంతంగా అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఎమ్మెల్యే ఆనందరావు అభివృద్ధి శ్రమను, కూటమి ప్రభుత్వ సంక్షేమాన్ని చూసి ఆకర్షితులైన జల్లివారిపేటకు చెందిన 10 మంది వారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లో చేరారు. వారికి ఎమ్మెల్యే టీడీపీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి ముఖ్య నాయకులు,కార్యకర్తలు,స్థానిక ప్రజలు తదితరులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




