Amalapuram: ఓడలరేవు గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు మంత్రి భరోసా

Amalapuram: ఓడలరేవు గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

SURESH, AMALAPURAM
Published on: 19 Aug 2026 9:43 PM IST
Amalapuram
X

Amalapuram: ఓడలరేవు గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు మంత్రి భరోసా

అమలాపురం: ఓడలరేవు సముద్రంలో వేటకు వెళ్లిగల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా వెంట నిలిచి ధైర్యాన్నిచ్చిన అమలాపురం ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి ఎమ్మెల్యే ఆనంద్ రావు ఆగస్టు 3న ఓడలరేవు ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ నుండి IND-AP-E8-MO-135 ‘ముత్యాలమ్మ’ బోటులో సముద్రంలోకి వెళ్లి గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.

ఈ పర్యటనలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి మంత్రి వెంట ఉంటూ,భాధిత కుటుంబాలకు కొండంత అండగా నిలిచారు. తమ ప్రాంత మత్స్యకారులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకురావడమే లక్ష్యంగా ఎమ్మెల్యే, ఎంపీ క్షేత్రస్థాయిలోనే ఉంటూ,మంత్రితో కలసి సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు.ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రక్షణ చర్యలను మరింత వేగవంతం చేశామని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం 300 నాటికల్ మైళ్ల పరిధిలో కోస్ట్‌గార్డ్‌కు చెందిన 5 నౌకలు,నేవీకి చెందిన 2 నౌకలతో పాటు 2 అత్యాధునిక విమానాలతో గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.అలాగే ఒడిశా,పశ్చిమ బెంగాల్,అసోం తీర ప్రాంత రక్షణ విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటున్నారు.పారాదీప్‌కు 15 నాటికల్ మైళ్ల దూరంలో ‘ముత్యాలమ్మ’ పేరుతో ఉన్న పసుపు రంగు బోటును గుర్తించారని,అది గల్లంతైన మత్స్యకారులదేనా అనేది నిర్ధారించుకోవడానికి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించినట్లు వెల్లడించారు.

బోటులో 1,000 లీటర్ల డీజిల్,దాదాపు 20 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉండటంతో పాటు ప్రస్తుతం సముద్ర వాతావరణం కూడా అనుకూలంగా ఉందని, మత్స్యకారులందరూ క్షేమంగా తిరిగి వస్తారని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. బాధితుల కుటుంబ సభ్యులకు ఎప్పటికప్పుడు తాజా పరిస్థితులను తెలియజేస్తూ అధికారుల బృందం ధైర్యం చెబుతోంది.

మత్స్యకారులు సురక్షితంగా ఇళ్లకు చేరేవరకు గాలింపు చర్యలు ఆపేది లేదని ఎమ్మెల్యే ఆనందరావు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు,ఎంపీ హరీష్ మధుర్ బాలయోగి,విప్ దాట్ల బుచ్చిబాబు,నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్,టిడిపి జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి,జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్,జిల్లా ఎస్పీ రాహుల్ మీనా,అముడా చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు,క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ దెందుకూరు సత్తిబాబు రాజు కూటమి కార్యకర్తలు, నాయకులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

SURESH, AMALAPURAM

SURESH, AMALAPURAM

Next Story