P Gannavaram: పి.గన్నవరం ఎమ్మెల్యేపై ఆరోపణలు అవాస్తవం.. ఎంపీటీసీల ఖండన

P Gannavaram: పి.గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలను జనసేన ఎంపీటీసీ అభ్యర్థులు ఖండించారు; ఏకాభిప్రాయంతో పినిపే శ్రీలక్ష్మి ఎంపిక వెల్లడి.

RAJU, P GANNAVARAM
Published on: 20 Nov 2026 9:37 PM IST
P Gannavaram
X

P Gannavaram: పి.గన్నవరం ఎమ్మెల్యేపై ఆరోపణలు అవాస్తవం.. ఎంపీటీసీల ఖండన

పి గన్నవరం: ​కొందరు జనసేన నాయకులు ఎమ్మెల్యేపై చేసిన ఆరోపణలను పార్టీ ఎంపీటీసీ అభ్యర్థులు తీవ్రంగా ఖండించారు. ఈ నెల 17వ తేదీన జనసేన పార్టీ నుంచి బీ-ఫామ్ పొందిన అభ్యర్థులు, ఎంపీటీసీలందరూ కలిసి ఎమ్మెల్యేతో సమావేశమైనట్లు వారు వెల్లడించారు. ఆ సమావేశంలో ఎమ్మెల్యే తమందరితో విడివిడిగా మాట్లాడారని, మద్దాల చంటి, ఆయన భార్య వరలక్ష్మిలకు ఎంపీపీ పదవి ఇవ్వకూడదని తామందరం కలిసి కోరినట్లు తెలిపారు.

​మద్దాల చంటి కేంద్ర పార్టీ ఆదేశాలకు భిన్నంగా సొంత నిర్ణయాలు తీసుకుంటూ, ఇతర గ్రామాల్లో జనసేన ఎంపీటీసీ అభ్యర్థులను ఓడించడానికి ప్రయత్నించారని ఆరోపించారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని ఆధారాలను ఎమ్మెల్యేకు మెయిల్ ద్వారా పంపించినట్లు వివరించారు.

​ఎంపీపీ పదవికి మీలో ఎవరిని ఎంచుకుంటారని ఎమ్మెల్యే అడగగా, అందరూ ఏకాభిప్రాయంతో విద్యావంతురాలైన పినిపే శ్రీలక్ష్మిని ఎంపిక చేసినట్లు చెప్పారు. అందుకు ఎమ్మెల్యే అంగీకరించి, అందరి నిర్ణయం మేరకే వ్యవహరిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే రూ. 40 లక్షలు తీసుకున్నారంటూ చేస్తున్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, తామంతా మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారమని, పార్టీ పరంగా ఎవరి నుండి ఆయన ఒక్క రూపాయి కూడా ఆశించలేదని స్పష్టం చేశారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM