P Gannavaram: పి. గన్నవరంలో ఏకలవ్యుని విగ్రహం ఆవిష్కరణ!
P Gannavaram: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఏకలవ్యుని విగ్రహాన్ని ఆవిష్కరించి, అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు.
P Gannavaram: పి. గన్నవరంలో ఏకలవ్యుని విగ్రహం ఆవిష్కరణ!
P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం, పి. గన్నవరం గ్రామంలోని డొక్కా సీతమ్మ అక్విడెక్ట్ వద్ద ఏకలవ్యుని జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఏకలవ్యుని విగ్రహాన్ని పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, ఏకలవ్యుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, పట్టుదల, స్వయంకృషి, గురుభక్తి, ఆత్మవిశ్వాసానికి చిరస్థాయి ప్రతీక అని అన్నారు. అవకాశాలు లేకపోయినా కష్టపడి సాధన చేస్తే ఎలాంటి లక్ష్యాన్నైనా చేరుకోవచ్చని ఏకలవ్యుని జీవితం నిరూపించిందన్నారు.
అనంతరం గన్నవరం త్రీ రోడ్ జంక్షన్‌లో ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఏకాగ్రత, కృషి, విద్య పట్ల అంకితభావంతో ఎన్నో విజయాలు సాధించి అత్యున్నత శిఖరాలకు చేరుకున్న మహనీయుడని కొనియాడారు. యువత అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని విద్య, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పి. గన్నవరం గ్రామంలో ఏకలవ్యుని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహక కమిటీ సభ్యులు, దాతలు, గ్రామ పెద్దలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ విగ్రహం భావితరాలకు స్ఫూర్తినిచ్చే చిహ్నంగా నిలవాలని ఆకాంక్షించారు.
చివరిగా, "పరిస్థితులు ఎలా ఉన్నా లక్ష్యాన్ని వదలకుండా కష్టపడితే విజయం తప్పకుండా సాధ్యమే" అనే ఏకలవ్యుని సందేశాన్ని, అలాగే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చూపిన విద్య, కృషి, సమానత్వ మార్గాన్ని ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు , ఏకలవ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




