P Gannavaram: సతీష్ అకాల మృతి బాధాకరం.. గిడ్డి సత్యనారాయణ
P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వెలువలపల్లి గ్రామానికి చెందిన బడుగు సతీష్ అకాల మరణం చెందారు.
P Gannavaram: సతీష్ అకాల మృతి బాధాకరం.. గిడ్డి సత్యనారాయణ
P Gannavaram: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అయినవిల్లి మండలం, వెలువలపల్లి గ్రామానికి చెందిన బడుగు సతీష్ ఇటీవల అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. ఈ నేపథ్యంలో ఈరోజు పి. గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ వెలువలపల్లి గ్రామంలో బడుగు సతీష్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ క్లిష్ట సమయంలో తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో కూటమి నాయకులు, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని బడుగు సతీష్‌కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.




