Gokavaram: గోకవరం సర్పంచ్ బరిలో పల్లెల బాబి సతీమణి ప్రసన్న!

Gokavaram: గోకవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో టీడీపీ యువ నాయకుడు పల్లెల బాబి సతీమణి ప్రసన్న. స్థానిక రాజకీయాల్లో జోరుగా చర్చ.

NARAYANA, RAJANAGARAM
Published on: 23 Oct 2026 8:55 PM IST
Gokavaram
X

Gokavaram: గోకవరం సర్పంచ్ బరిలో పల్లెల బాబి సతీమణి ప్రసన్న!

Gokavaram: గోకవరం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో స్థానిక రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పల్లెల బాబి అయన సతీమణి పల్లెల ప్రసన్న ను సర్పంచ్ బరిలో నిలిచేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో గ్రామ రాజకీయాల్లో యువ నాయకత్వంపై చర్చ మొదలైంది.

యువతలో మంచి పట్టు.. అన్ని వర్గాలతో సత్సంబంధాలు!

నిస్వార్థంగా, నిష్కల్మషంగా, ముక్కుసూటిగా వ్యవహరించే నాయకుడిగా గుర్తింపు పొందిన పల్లెల బాబికి గ్రామంలోని వివిధ వర్గాల ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన అను చరులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి ఆదరణ ఉందని, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

సర్పంచ్‌గా అవకాశం కల్పిస్తే అవినీతికి తావులేని పారదర్శక పాలన అందించడంతో పాటు, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాననే సంకల్పాన్ని పల్లెల ప్రసన్న (బాబి) ప్రజల్లోకి తీసుకెళ్తున్నట్లు సమాచారం. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడం తన ప్రాధాన్యతలుగా ఆయన ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది.

కులాలు, మతాలు, రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమన్యాయం చేస్తానని, అర్హత ఉన్నవారికి సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తాననే ఆయన వైఖరి స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతాననే సందేశంతో బాబి ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

యువ నాయకత్వానికి అవకాశం కల్పిస్తే గ్రామాభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందనే అభిప్రాయం కొందరు గ్రామస్థుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పల్లెల ప్రసన్న (బాబి )సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగితే గ్రామ రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయి? ప్రజల మద్దతు ఏ మేరకు లభిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

మొత్తానికి, గోకవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో యువ నాయకుడు పల్లెల ప్రసన్న (బాబి) పేరు చర్చలోకి రావడంతో గ్రామ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

NARAYANA, RAJANAGARAM

NARAYANA, RAJANAGARAM