Sakinetipalli: లంక రేవులో పునరుద్ధరించిన పంటు రాకపోకలు - ప్రయాణికులు హర్షం!

Sakinetipalli: గోదావరి వరద ఉధృతి తగ్గడంతో సఖినేటిపల్లిలంక - నరసాపురం మధ్య పునఃప్రారంభమైన పంటు సర్వీసులు. ప్రయాణికులకు దక్కిన ఉపశమనం.

PRABHU, RAZOLE
Published on: 1 Oct 2026 12:07 PM IST
Sakinetipalli
X

Sakinetipalli: లంక రేవులో పునరుద్ధరించిన పంటు రాకపోకలు - ప్రయాణికులు హర్షం!

Sakinetipalli: గోదావరి వరద ఉధృతి కారణంగా సఖినేటిపల్లిలంక రేవులో కొన్ని రోజులుగా నిలిచిపోయిన పంటు రాకపోకలను గురువారం పునరుద్ధరించారు. వరద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టడంతో అధికారులు పంటు రాకపోకలకు అనుమతించారు. దీంతో ఉదయం నుంచే సఖినేటిపల్లిలంక–నరసాపురం మధ్య పంటు సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.

పంటు ద్వారా ప్రయాణికులను వశిష్ట వారధి మీదుగా నరసాపురం వైపు తరలిస్తున్నారు. పంటు రాకపోకలు నిలిచిపోవడంతో గత కొన్ని రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకు సర్వీసుల పునరుద్ధరణతో ఉపశమనం లభించింది. ముఖ్యంగా సఖినేటిపల్లిలంక, పరిసర ప్రాంతాల ప్రజలు నరసాపురం వెళ్లేందుకు పంటు రవాణాపైనే ఆధారపడుతుండటంతో ఈ సేవలు పునరుద్ధరించడంతో వారి రాకపోకలు సులభతరమయ్యాయి.

ప్రయాణాలు సాఫీగా సాగుతుండటంతో స్థానికులు పశ్చిమ గోదావరి జిల్లాకు పంటు ద్వారా వెళ్లి తమ రోజువారీ పనులు, వ్యాపార, ఉద్యోగ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. పంటు సర్వీసులు పునరుద్ధరించడంతో రేవు వద్ద ప్రయాణికుల సందడి నెలకొంది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE