P. Gannavaram: పి. గన్నవరం జనసేనలో కాక: కొండేటి చిట్టిబాబు కుమార్తెకు జడ్పీ పీఠం ఇవ్వొద్దు!

P. Gannavaram: పి. గన్నవరంలో జనసేన వర్గాల్లో అసంతృప్తి. మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమార్తెకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి కేటాయింపును వ్యతిరేకించిన జనసైనికులు.

RAJU, P GANNAVARAM
Published on: 26 Oct 2026 12:45 PM IST
P. Gannavaram
X

P. Gannavaram: పి. గన్నవరం జనసేనలో కాక: కొండేటి చిట్టిబాబు కుమార్తెకు జడ్పీ పీఠం ఇవ్వొద్దు!

P. Gannavaram: ​పార్టీ కోసం నిరంతరం శ్రమించిన నిజమైన కార్యకర్తలను, నాయకులను విస్మరించి పదవులు కట్టబెట్టరాదని జనసేన నాయకులు, జనసైనికులు అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. పి.గన్నవరంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కుమార్తెకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఇవ్వాలనే ప్రతిపాదనపై జనసేన అధిష్టానం వెంటనే పునరాలోచన చేయాలని వారు స్పష్టంగా డిమాండ్ చేశారు. ​

నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని నమ్ముకుని కష్టపడిన వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే భవిష్యత్తులో పార్టీ దెబ్బతినే పరిస్థితులు ఉంటాయన్నారు.

​ఇప్పటికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వివాదంపై దృష్టిసారించి, స్థానిక నాయకుల అభిప్రాయాలను గౌరవిస్తూ సరైన నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

RAJU, P GANNAVARAM

RAJU, P GANNAVARAM