East Godavari: కడియం ఆర్టీసీ బస్టాప్‌లో శౌచాలయం మూసివేతతో ప్రయాణికుల అగచాట్లు!
East Godavari: తూర్పుగోదావరి జిల్లా కడియం ఆర్టీసీ బస్టాప్‌లో ఏడాదిగా శౌచాలయాన్ని మూసివేయడంతో ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
East Godavari: కడియం ఆర్టీసీ బస్టాప్‌లో శౌచాలయం మూసివేతతో ప్రయాణికుల అగచాట్లు!
East Godavari: తూర్పుగోదావరి జిల్లామండల కేంద్రమైన కడియం ఆర్టీసీ బస్ స్టాప్ లో అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. స్వచ్ఛభారత్ కు తూట్లు పొడుస్తూ బస్ స్టాప్ లో ఉన్న సౌచాలయాన్ని పలువురు వ్యక్తులు దౌర్జన్యంగా మూసివేశారు. దీంతో ప్రయాణికులు నానా ఆగచాట్లు పడుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు.
బస్టాప్ లో నిర్మించిన సౌచాలయాలను మార్గం లేకుండా మూసివేశారు. ఏడాదికాలంగా ఇలా మూసి ఉన్న అధికారులకు ఫిర్యాదుల పరంపర వెళుతున్న వీటిని తెరిపించలేదు. ఆర్టీసీ అధికారుల మొద్దు నిద్ర ఈ సమస్యకు ప్రధాన కారణంగా నిలుస్తుంది. ఓ ప్రధాన పత్రిక జర్నలిస్ట్ ఈ సౌచాలయాన్ని తెరవకుండా ఒత్తిడి తెస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి..భార్యాయుతంగా వ్యవహరించాల్సిన జర్నలిస్ట్ తన స్వార్థం కోసం సామాజిక స్థలాన్ని మూసివేయడంపై పలువురు ముక్కున వేలు వేసుకుంటున్నారు. తక్షణం సంచాలయ్య ద్వారాలు తెరిపించాలని పలువురు ప్రజాప్రతినిధులు కూడా కోరుతున్నారు.




