Rajahmundry: 'పేదల సేవలో 2.0' కార్యక్రమం.. కమిషనర్ రాహుల్ మీనా!

Rajahmundry: రాజమండ్రి వెంకటరామయ్యనగర్‌లో 'పేదల సేవలో 2.0' కార్యక్రమాన్ని నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలని ఆదేశం.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY
Published on: 1 Oct 2026 5:28 PM IST
Rajahmundry
X

Rajahmundry: 'పేదల సేవలో 2.0' కార్యక్రమం.. కమిషనర్ రాహుల్ మీనా!

Rajahmundry: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ఏ పథకానికైనా అర్హత ఉండి ప్రయోజనం పొందని వారిని గుర్తించి వారికి పారదర్శకంగా లబ్ధి చేకూర్చడం ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గం వెంకటరామయ్యనగర్లోని వార్డు సచివాలయంలో గురువారం ‘పేదల సేవలో 2.0’ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలోని అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అనే అంశంతో పాటు ఆయా పథకాల ద్వారా కుటుంబానికి కలిగిన ఆర్థిక ప్రయోజనం, జోవనోపాధిలో వచ్చిన మార్పు, ఇంకా అందాల్సిన సంక్షేమ ప్రయోజనాలు మరియు అవసరమైన చర్యలను గుర్తించడం కార్యక్రమ ముఖ్య ఉద్దేశమన్నారు.

వార్డు 1 & 2 లోని 5 సచివాలయాల పరిధిలో 1,461 మందికి ప్రతినెలా క్రమంతప్పకుండా ఇంటివద్దకే పింఛన్ అందజేస్తున్నట్లు తెలిపారు. అలాగే 1,923 మందికి తల్లికి వందనం., 154 మందికి ఆటో డ్రైవర్ సేవలో ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు వెల్లడించారు. ఇలా వివిధ పథకాల ద్వారా 5 సచివాలయాల పరిధిలో ఏటా దాదాపు రూ. 10 కోట్ల సంక్షేమం అందజేస్తున్నట్లు వివరించారు. అనంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి పథకాల లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించారు. ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులను తప్పనిసరిగా నమోదు చేసి, వాటి పరిష్కారాన్ని పర్యవేక్షించాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి.రామలింగేశ్వర్, స్థానిక నాయకులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

RAGHAVENDRA, RAJUMUNDRY CITY

RAGHAVENDRA, RAJUMUNDRY CITY